SPS నెల్లూరు జిల్లా

*నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్న డ్రోన్ నిఘా-జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*

 జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి సూచనల మేరకు, సంబంధిత DSP గార్ల ఆధ్వర్యంలో ఆయా CI/SI ల సమక్షంలో డ్రోన్ తో, నెల్లూరు పట్టణ, శివారు, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో క్షుణ్ణంగా పరిశీలించి, పట్టణ సమీప ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డు కట్టు వేస్తున్న నెల్లూరు పోలీసులు.
 జిల్లావ్యాప్తంగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మరియు ప్రత్యేకంగా టౌన్ పరిసర ప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు విస్తృతంగా డ్రోన్ నిఘా ఏర్పాటు చేసిన నెల్లూరు పోలీసులు
 నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాలలో నేరాలకు చెక్ పెడుతూ, జల్లెడ పడుతున్న నెల్లూరు పోలీసులు.
 అందులో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ పై ఉక్కుపాదం మోపుతూ కేసులు నమోదు చేయడం జరిగింది.
 గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా… బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..
 ఓవర్‌ స్పీడ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లను గుర్తిస్తాం..
 నేర నియంత్రణే లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా….
 క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్న నెల్లూరు పోలీసులు.
 బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది.
 నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశితమైన ప్రదేశాలను ముందుగా గుర్తించి, పాడుపడిపోయిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, నదీ తీరాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి, నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
 కావున ఎవరైన చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు.
 గంజాయి సేవించడం, అమ్మడం, రవాణా చేసే వారు పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
 జిల్లాలో ఇకపై సాంకేతికతతో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రించుటకు వినూత్న చర్యలు తీసుకుంటున్న నెల్లూరు పోలీసులు. ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కి తెలపగలరు.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.19.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed