*నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తాం*

– ఉదయగిరి అంటే ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక అభిమానం.
– ఎంపి వేమిరెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ విపిఆర్ అమృతధార ఉదయగిరి నుంచే ప్రారంభించాం.

విపిఆర్ నేత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

– కంటి వెలుగు ప్రసాదించే విపిఆర్ నేత్ర కూడా ఉదయగిరి నుంచే ప్రారంభిస్తున్నాం.
– ఉదయగిరి ప్రజానీకం మా పట్ల చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు.
– పేద ప్రజలకు మంచి చేయాలన్నదే ఎంపి వేమిరెడ్డి గారి తాపత్రయం.
– విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, విపిఆర్ వికాసం లాంటి పలు ప్రాజెక్టుల ద్వారా సమాజంలో వివిధ వర్గాలకు సేవలందిస్తున్నాం.
– రాజకీయ నాయకులు, ఆరోగ్య కార్తలు మరియు స్వక్షంద సేవకులు ప్రత్యేక చొరవ తీసుకొని విపిఆర్ నేత్ర సేవలు ప్రజలకు చేరువ చేయాలి.
– విపిఆర్ నేత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

కంటి చూపు సమస్యలతో బాధపడే వారికి వెలుగు ప్రసాదించాలన్న పవిత్ర ఆశయంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ నేత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. విపిఆర్ నేత్ర ప్రారంభోత్సవం పురస్కరించుకొని వరికుంట పాడు మండలం రామాపురం చేరుకున్నవేమిరెడ్డి దంపతులను తెలుగుదేశం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు మండల వ్యాప్తంగా తరలి వచ్చిన వేలాది ప్రజలు ఘన స్వాగతం పలికారు. విపిఆర్ జిందాబాద్ అన్న అభిమానుల నినాదాల మధ్య విపిఆర్ నేత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆశీనులైన వేమిరెడ్డి దంపతులకు ఉదయగిరి నాయకులు, విపిఆర్ అభిమానులు శాలువాలు, పుష్ప గుఛ్ఛాలతో సన్మానించి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ రామాపురం ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియ చేశారు. ప్రజా సేవ చేయాలన్న ఉన్నత ఆశయంతో 2015లో “విపిఆర్ ఫౌండేషన్” ప్రారంభించామన్నారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ విపిఆర్ అమృతధార ఫ్లోరైడ్ బాధిత ప్రజలున్న ఉదయగిరి నుంచే ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 కు పైగా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామన్నారు. నాడు 2016 లో ఉదయగిరిలో 10 ఏళ్ళ క్రితం ప్రారంభమైన తొలి వాటర్ ప్లాంట్ నేటికీ ప్రజల దాహార్తి తీరుస్తుందన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వరంలో విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, విపిఆర్ వికాసం లాంటి పలు ప్రాజెక్టుల ద్వారా ద్వారా సమాజంలో వివిధ వర్గాలకు సేవలందిస్తున్నామన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తిరుపతిలోని స్విమ్స్ కు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే అత్యాధునిక వైద్య సదుపాయాలున్న బస్ అందచేసిందన్నారు. కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వరంలో 10 వేల మంది మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తే అందులో దాదాపు 1 వెయ్యి మందికి క్యాన్సర్ ప్రాధమిక దశలో వున్నట్టు నిర్ధారణ అయిందని ముందుగానే గుర్తించబట్టి వారికి మెరుగైన చికిత్సలు అందించి క్యాన్సర్ నివారణ చర్యలు చేపట్టామన్నారు.

తమ ఫౌండేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని ఎమ్మెల్ల్యే ప్రశాంతి రెడ్డి గారు వెల్లడించారు. ఉదయగిరి ప్రాంత ప్రజానీకం అంటే ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక అభిమానమన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా గతంలో ఉదయగిరి నుంచి ప్రారంభభించిన దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు అందచేసే కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ ఉచిత క్యాన్సర్ పరీక్షల ప్రాజెక్ట్ ను కూడా ఉదయగిరి నుంచే ప్రారంభిస్తామన్నారు. “విపిఆర్ నేత్ర” కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి ఆమె ధన్యవాదాలు తెలియ చేశారు. కంటి చూపు సమస్యను ప్రాధమిక దశలో గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే భవిషత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించు కోవలసిందిగా ఆమె ప్రజలను కోరారు. “విపిఆర్ నేత్ర” తమ తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు స్థానిక నాయకులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు స్వక్షంద సంస్థల నిర్వాహకులు ప్రత్యేక చొరవ చూపించి “విపిఆర్‌ నేత్ర” ఉచిత కంటి వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి. మాజీ జెడ్పి ఛైర్మెన్ చెంచలబాబు బాబు యాదవ్, స్థానిక నాయకులు చండ్ర మధుసూదన రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed