*” కాకాణితో పలువురు ప్రధాన నేతల భేటీ”*
*నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డితో పలువు రు నేతలు భేటీ అయ్యారు.*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:22-01-2025*
*మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో శాసన మండలి సభ్యులు మరియు నెల్లూరు నగర ఇన్చార్జ్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు మరియు కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు మరియు సుళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కిలివేటి సంజీవయ్య గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.*
*జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పట్ల అనేక విషయాలు చర్చించారు.*
*కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, కాకాణిపై కేసులు నమోదు చేయడంతో జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నేతలు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.*
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా అందరం కలిసి పని చేయాలని పిలుపునిచ్చిన కాకాణి.*
*కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలానికి సంబంధించిన పలువురు గ్రామ సర్పంచులు, జిల్లా కలెక్టర్ తమ చెక్ పవర్ రద్దు చేయడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కక్ష సాధింపులో భాగంగానే తమ చెక్ పవర్ రద్దు చేశారంటూ కాకాణికి ఫిర్యాదు చేశారు.*
*ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ..*
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులపై కక్ష సాధింపులో భాగంగా చెక్ పవర్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ, న్యాయ పోరాటాలు చేయడంతో పాటు, ప్రజా పోరాటాలుకు శ్రీకారం చుడుతామని, పోలీసు కేసులకు భయపడమని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు.*
*జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ అండగా నిలిచి, జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయడంతో పాటు జగనన్నను తిరిగి మరలా ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని కాకాణి పిలుపు ఇచ్చారు.*