*నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 95 వేల కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రడ్డి*
నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 95 వేల కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు. ఈ ప్రాంతంలో ఈ కర్మాగారం ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు, ప్రత్యక్షo గా ను, పరోక్షంగా పెరుగుతాయని, విద్యావంతులకు, సాంకేతిక నైపుణ్యం వున్నవారికి అపారమైన అవకాశాలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు. నెల్లూరుజిల్లా పూర్తిస్థాయిలో అభివృద్ధికి రెండు పోర్టులు – కృష్ణపట్నం, రామాయపట్నం దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. రాష్ట్రము లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలలోనే అత్యంత భారీ పెట్టుబడులను, అదీ కూడా నెల్లూరు జిల్లాకు తీసుకురావడం సంతోషకరమైన విషయమని మంత్రి ఆనం అన్నారు. బిపిసిఎల్ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహం ఇచ్చిన ముఖమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి ఆనం కృతజ్ఞతలు తెలిపారు.