*నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా జలదంకి సుధాకర్*
*నిర్ణయం తీసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి*
*.. మొదటి నుంచి పార్టీ కోసం నిరంతరం కష్టపడిన జలదంకి*
*టీడీపీ కార్యకర్తల్లో హర్షాతిరేకాలు*.
*నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా జలదంకి సుధాకర్ నియమితులు కాబోతున్నారు. గత కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షుల సమన్వయ కమిటీ సమావేశంలో రాజకీయ పదవులకు సంబంధించి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ని నెల్లూరు రూరల్ కి కేటాయించడం జరిగింది.*
*జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కు సంబంధించి నిర్ణయం తీసుకునే బాధ్యత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి అప్పజెప్పటం జరిగింది. దీంతో నెల్లూరు రూరల్ లో పలువురు నాయకులు ఈ పదవి కోసం పోటీపడ్డారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి. ఈ యొక్క పరిస్థితుల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్ని ఆలోచనలు చేసి, అనేకమందితో చర్చించి, సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో సేవలు అందిస్తూ, అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి జలదంకి సుధాకర్ ని ఈ పదవికి ఎంపిక చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.*
*ఈ మేరకు అతి త్వరలో ఉత్తర్వులు. వెలువడబోతున్నాయి. ఏది ఏమైనా జలదంకి సుధాకర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎంపిక కావటం నెల్లూరు రూరల్ నియోజకవర్గమే కాకుండా నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటినుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న జలదంకి సుధాకర్ కు పదవి తగ్గటంతో పలువురు కార్యకర్తలు శభాష్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ..కార్యకర్తకే పట్టాభిషేకం చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటూ అభినందన వర్షం కురిపిస్తున్నారు.*