ఏ
*నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి-167B పై సీతారామపురం బైపాస్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియజేయాలని కోరిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*
*సీతారామపురం బైపాస్ ఎప్పటికి పూర్తవుతుంది?*
నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి-167B పై సీతారామపురం బైపాస్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. లోక్‌సభలో గురువారం ఈ మేరకు పలు ప్రశ్నలు వేశారు. బైపాస్ విస్తరణను ఫిబ్రవరి 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అని ఆరా తీశారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్ని వాస్తవమేనా అని వివరాలు కోరారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని NH-167B ఆధునికీకరణ, పునరావాసంలో భాగంగా సీతారామపురానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయబడిందన్నారు. ఆగస్టు 2024 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఫిబ్రవరి, 2023లో ప్రాజెక్టు ప్రారంభమైందన్నారు. 20.12.2024న సీతారామపురం బైపాస్‌లో కాంక్రీట్ పనులు పూర్తి అయ్యాయన్నారు. 15.03.2025న రహదారిపై గ్రామాల పేర్ల బోర్డుల ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. కడప-నెల్లూరు సరిహద్దును NH-167B యొక్క CS పురం నుండి కలిపే ఈ మొత్తం ప్రాజెక్ట్ లో ఫిజికల్ వర్క్ ప్రస్తుతం దాదాపు 93% పూర్తయినట్లు చెప్పారు. ప్రాజెక్ట్ 31.05.2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.