*నెల్లూరు జిల్లాకు బాల బాలికలకు వేర్వేరుగా రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.*

 

*గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేద్దాం*

– ఎస్సి జనాభా 50 శాతం కంటే ఎక్కువగా వున్న గ్రామాలకు వర్తించే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం 20 లక్షల ఆర్ధిక ప్రోత్సాహకం ఎస్టీ జనాభా అధికంగా వున్న గ్రామాలకు వర్తించేలా చర్యలు తీసుకోవాలి.
– ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక చేయూత పధకాల గురించి గిరిజనులకు అవగాహన కల్పించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
– గిరిజనులకు ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు తెరిచేలా అధికారులు చొరవ తీసుకోవాలి.
– ఏజన్సీ ప్రాంతాలతో పోలిస్తే ITDA పరిధిలో వున్న జిల్లాలకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారు, జనాభా ప్రాతిపదకన నిధులు కేటాయించాలి.
– కొడవలూరు మరియు ఇందుకూరుపేట మండలాలలో హాస్టల్ కనవర్టెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థల సేకరణ చేస్తున్నాం.
– నెల్లూరు జిల్లాకు బాల బాలికలకు వేర్వేరుగా రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

సామజికంగా వెనుకబడ్డ యానాదులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరవేయడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. విజయవాడలోని వెన్నెలకంటి రాఘవయ్య కాన్ఫరెన్స్ హాలులో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న 10 వ గవర్నర్ బాడీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న గవర్నర్ బాడీ సభ్యురాలి హోదాలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. కోవూరు నియోజకవర్గంలో యానాదులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను ఆమె అధికారులకు వివరించారు. 2016 నుంచి 2022 వరకు నేషనల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేవలం 72 మంది లబ్ధిదారులకు రుణ సహాయం అందించిన గణాంకాలు చూస్తుంటే ప్రభుత్వ పధకాలపై గిరిజనుల అవగాహన రాహిత్యం కనిపిస్తుందన్నారు. యానాదులను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక చేయూత పధకాలను అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పర్యవేక్షించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు సూచించారు. గిరిజనులు ప్రభుత్వ పధకాల ద్వారా లబ్ది పొందడంలో ఆధార్ ప్రధాన అవరోధంగా మారుతుందన్నారు. గిరిజనులలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు కూడా లేవని అధికారులు స్పందించి గిరిజనులను ఒప్పించి బ్యాంక్ ఖాతాలు తెరిచేలా చొరవ తీసుకోవాలన్నారు.

కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలంలో అధికారులను జిల్లా అధికారుల సహకారంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గిరిజన పిల్లలకు ఆధార్ కార్డులు మరియు బర్త్ సర్టిఫికెట్లు అందించిన విషయాన్ని పేర్కొన్నారురు. గిరిజనులకు ప్రయోజనం చేకూర్చే ధర్తి జన్ జాతీయ ఉత్కర్ష్ అభియాన్ (DA-JGUA) స్కీమ్ ను కోవూరు నియోజకవర్గంలో వున్న 21 హ్యాబిటేషన్స్ వర్తించేలా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు చొరవ చూపాలన్నారు. నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన పిల్లలకు సంబంధించి హాస్టల్ కనవర్టెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థల సేకరణకు సంబంధించి కొడవలూరు మరియు ఇందుకూరుపేట మండల తహసీల్దారులకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. గిరిజనులకు చదువు యొక్క ప్రాముఖ్యత వివరించి పిల్లలను చదివించేలా ప్రోత్సహించాలని కోరారు.

గిరిజన సంక్షేమ పధకాలకు సంబంధించి ఏజన్సీ ప్రాంతాలతో పోలిస్తే ITDA పరిధిలో వున్న జిల్లాలకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారని జనాభా ప్రాతిపదకన నిధులు కేటాయించాలని కోరారు. ఎస్సి జనాభా 50 శాతం కంటే ఎక్కువగా వున్న గ్రామాలకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పధకం ద్వారా అందించే 20 లక్షల ఆర్ధిక ప్రోత్సాహకం ఎస్టీ జనాభా అధికంగా వున్న గ్రామాలకు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు జిల్లాకు బాల బాలికలకు వేర్వేరుగా రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సూచనలు సావధానంగా విన్న అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కార్యరూపం దాల్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల సమస్యల పై సంపూర్ణ అవగాహనతో పాటు వారి సంక్షేమనికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని గిరిజనాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు ప్రశంశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed