
*నెల్లూరు చిల్డ్రన్ పార్క్ జనతా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మోపురు శ్రీనివాసులు*
నెల్లూరు చిల్డ్రన్ పార్క్ జనతా వాకర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిని బుధవారం స్థానిక రామలింగాపురంలోని కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనతా వాకర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ ముక్కు రాధాకృష్ణ గౌడ్ సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహించబడింది.
జనత వాకర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ అసోసియేషన్ నిబంధనల మేరకు నూతన అధ్యక్షలుగా మోపూరు శ్రీనివాసులు ను ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, ఆరోగ్యం మరియు చిల్డ్రన్ పార్క్ అభివృద్ధిలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ గౌడ్ కి మరియు ఇతర సభ్యులకు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మోపూరి శ్రీనివాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాకర్స్ సమస్యల పరిష్కారానికి, పార్క్ అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటామని వారు హామీ ఇచ్చారు.
చిల్డ్రన్స్ పార్క్ జనతా వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా జొన్నలగడ్డ అవినాష్ నాయుడు, ప్రద్యుమ్నారెడ్డి లను కూడా నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు కాయల మధు, పోలిచెర్ల ఉదయ్ కుమార్, జిల్లా ట్రెజరర్ భాను కిరణ్, చిల్డ్రన్స్ పార్క్ వాకర్లు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.