
*నెల్లూరు సమస్యలపై – శాసనమండలిలో చంద్రశేఖర్ రెడ్డి….*
*నెల్లూరు చింతా రెడ్డిపాలెం నేషనల్ హైవే జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ ను, సర్వీసు రోడ్డు ను సత్వరమే ఏర్పాటు చేయాలి* .. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
—————————————-
గుంటూరు జిల్లా అమరావతి ఏపీ శాసనమండలి సమావేశాల్లో *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు…
• *నెల్లూరు చింతా రెడ్డిపాలెం నేషనల్ హైవే జంక్షన్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుందన్నారు.*
• *అటు నెల్లూరు నుంచి చెన్నై విజయవాడ వైపు వెళ్లే అధిక వాహనాలు ఈ జంక్షన్ గుండా ప్రయాణాలు సాగించడంతో పాటుగా.. పెద్ద ఎత్తున వాహనాలు ఈ మార్గం గుండానే నెల్లూరు నగరంలోకి ప్రవేశిస్తుంటాయని తెలిపారు.*
• *ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.*
• *ఈ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు.. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించే విధంగా సత్వరమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి తెలియ చేశారు.*