*నెల్లూరులో బీసీ భవనానికి కోటి విరాళం ఇచ్చిన మంత్రి నారాయణ*

*కలెక్టర్‌కు కోటి రూపాయల చెక్కును అందచేసిన మంత్రి అల్లుడు గంటా రవితేజ*

*మాట తప్పని మంత్రి. కాపు భవనానికి 2 కోట్లు.షాదీ మంజిల్ కి 50 లక్షలు ,నేడు బీసీ భవనానికి కోటి*

నెల్లూరు జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి మంత్రి నారాయణ నిరంతరం శ్రమిస్తున్నారు. గతంలో కాపు భవన నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు ,షాదీ మంజిల్ కి 50 లక్షలు భారీ విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్న ఆయన నేడు బీసీ భవన నిర్మాణ పనుల కోసం కోటి రూపాయల విరాళం అందచేశారు .

మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పలువురు బీసీ నాయకులతో కలిసి కోటి రూపాయల చెక్కును శుక్రవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేసారు .సమాజంలోని అన్ని వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు అందుబాటులో ఉండాలన్నదే తమ ఆశయమని గంటా రవితేజ పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలతో పాటు సామాజిక భవనాల నిర్మాణానికి మంత్రి నారాయణ అందిస్తున్న చేయూత పట్ల జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు ,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, టిడిపి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి,సిటీ మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి. బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed