*నెల్లూరులో నకిలీ IRS ఆఫీసర్ కేసును చేధించిన సంతపేట పోలీసులు-టౌన్ డి.యస్.పి. పి.సింధుప్రియ*

కర్ణాటక రాష్ట్రమునకు చెందిన నిందితుడు రాంపూర్ రమేష్ అను అతను తాను IRS ఆఫీసర్ ని అని నెల్లూరుకు చెందిన వెంకట రమణ అను అతనికి భూమి వివాదము పరిష్కరిస్తాను అని చెప్పి రెండు లక్షల రూపాయలు అడిగి ఆ మేరకు నిందితుడు నకిలీ IRS ఆఫీసర్ నేమ్ ప్లేట్, గవర్నమెంట్ అఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ రీజినల్ కమిషనర్ నేషనల్ ఎంబ్లెమ్ కలిగిన బోర్డు మరియు రీజనల్ కమిషనర్ నెల్లూరు అను స్టాంపు ను తాయారు చేయించుకుని KA 36 Z 2681 అను కారు లో అతని స్వగ్రామము అయినా దొంగరంపూరు గ్రామము కర్ణాటక రాష్ట్రము నుండి నెల్లూరుకు వచ్చి సదరు వెంకట రమణ కు ఫోన్ చేస్తే కలవలేదు ఆ రాత్రి నిందితుడు నెల్లూరు లోని ఆదిత్య నగర నందు 2వ లైను నందు వుండినాడు.

తేదీ 04.06.2025 న ఉదయం సుమారు 10.00 గంటల సమయములో సదరు నిందితుడు నెల్లూరు లోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాయలయము లోనికి వెళ్లి దేవస్థానము E. O గారైన ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి గారితో తాను IRS ఆఫీసర్ ని అని రీజనల్ జాయింట్ కమిషనర్ గా బదిలీ పై నెల్లూరుకు వచ్చి రిపోర్ట్ చేసుకునే దానికి ముందుగా స్వామీ వారి దర్శనమునకు వచ్చినానని చెప్పి దర్శనము చేసుకుని తాను ఆదాయపన్ను గురించి మరియు భూ వివాదములు గురించి చూస్తుంటానని చెప్పి భూ వివాదమునకు సంబందించిన రిపోర్ట్ కాపీని తీసుకుని వెళ్లినాడు.

నిందితుడు రంగనాయకుల స్వామి దేవస్థానమునకు వచ్చిన సమయము లో అతని యొక్క కారుకు ముందు వైపున గవర్నమెంట్ అఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ రీజినల్ కమిషనర్ నేషనల్ ఎంబ్లెమ్ కలిగిన బోర్డు పెట్టుకుని వుండి కారు అద్దము దగ్గర DR రమేష్ రాంపూర్ IRS అను నేమ్ ప్లేట్ పెట్టుకుని వుండి దేవస్థానము E.O గారిచ్చిన భూ వివాదము రిపోర్టు కాపి పై రీజనల్ కమిషనర్ నెల్లూరు అను స్టాంపు వేసినట్లు అక్కడ నుండి వెళ్ళిపోయినాడు.

నిందితుడు అదే రోజు సాయంత్రం 05. గంటల సమయములో దేవస్థానము E. O గారికి ఫోన్ చేసి నన్ను కలవమని చెప్పగా E. O గారు ఇప్పుడు వీలుపడదని చెప్పినాడు.

సదరు దేవస్థానము E. O గారికి నిందితుని పై అనుమానము వచ్చి అతని గురించి విచారించగా అతను నకిలీ IRS ఆఫీసర్ అని తెలిసినందున ఆ విషయమై అదే రోజు అనగా తేదీ 04.06.2025న రాత్రి 09.30 గంటలకు సంతపేట పోలీస్ స్టేషన్ నందు రిపోర్టు ఇవ్వడం జరిగినది.

సంతపేట CI గారు కేసు నమోదు చేసి చాక చక్యం గా వ్యవహరించి ముద్దాయిని అరెస్ట్ చేయడము ພ໖໐໖.

కేసు నమోదు:

క్రి.నం.119/25 U/సెక్షన్ 319(2), 318(4), 338, 341(1) BNS,

ముద్దాయి వివరములు:

రాంపూర్ రమేష్. తండ్రి లక్ష్మణ్, వయస్సు 23 సం : లు, కులము కుమ్మరి, బసవన్న ఏరియా, దొంగరంపూర్, రాయిచూర్, కర్ణాటక రాష్ట్రము..

ఫిర్యాది వివరములు:

ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి, తండ్రి వీర రెడ్డి, వయస్సు 55 సం : లు, రాంజీ నగర్, నెల్లూరు సిటీ, కార్యనిర్వాహణ అధికారి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు సిటీ

కేసు ఛేదన :

శ్రీ నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ జి. కృష్ణకాంత్,IPS., గారి ఆదేశాల మేరకు, నెల్లూరు నగర డి.యస్.పి శ్రీమతి పి.సిందుప్రియ గారి నేతృత్వములో, సంతపేట పోలీస్ స్టేషన్ C.1 జి దశరధరామ రావు గారు మరియు వారి సిబ్బంది సహాయముతో దర్యాప్తు జరిపి ముద్దాయిని తేదీ 06.06.2025న సాయంత్రము 03.50 గంటలకు నెల్లూరు సిటీ ఆదిత్య నగర్ నెల్లూరు నగరము నందు అరెష్టు చేసి అతని వద్ద నుండి 1.రమేష్ రాంపూర్ IRS ఆఫీసర్ నేమ్ ప్లేట్, 2.గవర్నమెంట్ అఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ రీజినల్ కమిషనర్ నేషనల్ ఎంబ్లెమ్ కలిగిన బోర్డు, 3.రీజనల్ కమిషనర్ నెల్లూరు అను స్టాంపు, 4.KA 36 Z 2681 అను కారు, 5. రెండు సెల్ ఫోన్లు, 6. ఫిర్యాది ఇచ్చిన రిపోర్ట్ కాపీ ని తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకొనడమైనది. ముద్దాయిని రిమాండుకు తరలించడమైనది

పై కేసు ను చేధించుటలో ప్రతిభ కనపరచిన సంతపేట ఇన్స్పెక్టర్ జి దశరథరామారావు గారిని, S.I జి బాల కృష్ణ గారిని మరియు సిబ్బందిని జిల్లా SP గారు మరియు నెల్లూరు నగర DSP గారు అభినందించడమైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed