నెల్లూరులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో అదుర్స్
May 3, 2024 10
Jana Hushaar news ( Nellore ) – తెలుగుదేశం పాార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు శుక్రవారం రాత్రి నెల్లూరులో నిర్వహించిన రోడ్ షో అదుర్స్ అనిపించేలా సాగింది.
రూరల్ నియోజకవర్గ పరిధిలోని కేవిఆర్ పెట్రోల్ బంకు సెంటర్ నుండి ప్రారంభమైన ఈ రోడ్ షో ఆర్టీసీ బస్ స్టేషన్, మద్రాస్ బస్టాండ్, విఆర్సీ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, ఏసి సెంటర్ మీదుగా నర్తకి సెంటర్ కు చేరుకుంది. ఈ రోడ్ షోకు వేలాది మంది టిడిపి, జనసేన, బిజేపి కార్యకర్తలు హాజరయ్యారు.
రోడ్ షో లో భాగంగా చంద్రబాబు, పవన్ తో పాటూ ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిటీ, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా ప్రచార రథంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు.
రోడ్ షోకు వేలాది ప్రజలు తరలిరావడంతో రోడ్లు ఇసుకేస్తే రాలనంతగా మారాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి అంశం ఏంటంటే నెల్లూరు సిటీ అసెంబ్లీ అభ్యర్ధి పొంగూరు నారాయణకు మద్దతుగా మైనార్టీ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావడం విశేషం.