
*నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 30 వ డివిజన్ కొత్తూరు రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో అధికారులతో కలిసి శనివారం పర్యటించిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*
స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఆ ప్రాంతంలో అవసరమైన రోడ్లు, డ్రైను కాలువలు, విద్యుత్ వీధి దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు.
అనంతరం స్థానికంగా ఉన్న కొన్ని భవనాలకు అసెస్మెంట్ డిమాండ్లను కమిషనర్ తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ హిమబిందు, ఇంజనీరింగ్ విభాగం రెవెన్యూ విభాగం అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.