*నిర్మాణం అవుతున్న భవనాన్ని తనిఖీ చేసే పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన అనుమతులను పరిశీలించారు. భవనానికి సంబంధించి అసెస్మెంట్ డిమాండ్ తనిఖీ చేసి కొలతలను వేసి పరిశీలించిన కమిషనర్ వై.ఓ. నందన్*

 

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక బి.వి నగర్ ప్రాంతంలో గురువారం ఆకస్మికంగా పర్యటించారు. స్థానికంగా నిర్మాణం అవుతున్న భవనాన్ని తనిఖీ చేసే పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన అనుమతులను పరిశీలించారు. భవనానికి సంబంధించి అసెస్మెంట్ డిమాండ్ తనిఖీ చేసి కొలతలను వేసి పరిశీలించారు.

ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అదనపు అంతస్తు పనులను కమిషనర్ ఆపివేయించారు. నోటీసులు జారీ చేయాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ ఆదేశించారు.

ఇస్కాన్ సిటీ ప్రాంతంలోని కాలువ గట్టుపై ఏర్పాటు చేసిన దుకాణాలు, ఇళ్లను తొలగించి కాలువ ఆక్రమణలకు గురవకుండా చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed