*నిర్దేశించిన రోడ్డు మార్జిన్ దాటి వ్యాపారాలు నిర్వహించకుండా నిరంతరం పర్యవేక్షించాలని, రోడ్డు మార్జిన్ దాటిన వ్యాపారులను స్వచ్ఛందంగా మార్జిన్ పరిధిలోకి దుకాణాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కమిషనర్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక 12వ డివిజన్ ధనలక్ష్మిపురం ప్రాంతంలో సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు.

స్థానికంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణాన్ని కమిషనర్ పరిశీలించి పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన అనుమతులను తనిఖీ చేశారు. ఖాళీ స్థలం పన్నుతో పాటు భవనానికి కొలతలు వేసి అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేశారు.

ప్రతి ఒక్క దుకాణానికి తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్సులు ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.

నిర్దేశించిన రోడ్డు మార్జిన్ దాటి వ్యాపారాలు నిర్వహించకుండా నిరంతరం పర్యవేక్షించాలని, రోడ్డు మార్జిన్ దాటిన వ్యాపారులను స్వచ్ఛందంగా మార్జిన్ పరిధిలోకి దుకాణాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని, అలా నిర్వహించని షాపులను తొలగిస్తామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *