నిర్ణీత వ్యవధిలోనే లేఔట్స్ కి అప్రూవల్ వచ్చేలా చర్యలు – నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..

– ప్లానింగ్, ఇంజనీరింగ్, అకౌంట్ డిపార్ట్మెంట్ అధికారులతో నుడా చైర్మన్ హోదాలో తొలిసారి సమీక్ష సమావేశం..

– ప్రైవేట్ భాగస్వామ్యంతో నుడా తరుపున లేఔట్స్ వేసి వాటిని డెవలప్ చేసి.. నుడా కి రెవిన్యూ పెంచుదాం..

– నుడా తరపున లేఅవుట్ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం..

– నుడా అనుమతులు లేకుండా లేఔట్లు వేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు..

– మంత్రి నారాయణ ఆదేశాల మేరకు.. 24 గంటల్లోనే లే అవుట్ లకు అనుమతి వచ్చేలా చర్యలు..

– పంచాయతీ సెక్రటరీలకు నుడా నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచనలు..

– ఔటర్ రింగ్ రోడ్డు స్థితిగతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న కోటంరెడ్డి..

– మంత్రి నారాయణ సహకారంతో ఔటర్ రింగ్ రోడ్డు ఫైల్ లో కదలికలు వచ్చేలా చర్యలు..

ముడా పరిధిలో వేసే లేఔట్లకు 24 గంటల్లోనే అనుమతులు వచ్చేలా అధికారులు పనిచేయాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆదేశించారు.. అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.. నుడా ఆఫీసులోని తన ఛాంబర్ లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు..
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నుడా పరిధిలో లేఔట్స్ డెవలప్ చేసి రెవెన్యూ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు లేఔట్ యజమానులకు 24 గంటల్లోపే అనుమతులు ఇవ్వాలని.. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్స్ వేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.. ఈ విషయంలో పంచాయతీ సెక్రటరీ అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు.. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. గతంలో తాను చైర్మన్ గా ఉన్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని.. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.. మంత్రి నారాయణ సహకారంతో ఔటర్ రింగ్ రోడ్డు అంశంలో సీరియస్ గా దృష్టి సారించి.. పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.. స్వచ్ఛ నెల్లూరును సహకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.. పొంగూరు నారాయణ ప్రత్యేక శ్రద్ధతో పార్కులను డెవలప్ చేస్తే.. వైసీపీ ప్రభుత్వం కనీసం వసతులు కూడా కల్పించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వసతులు లేక మూలన పడ్డ పార్కులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా గ్రీనరీ ని పెంపొందిస్థామని అయన అన్నారు.. MIG లేవుట్స్ స్థితిగతులను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు.. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed