*నిరు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరం*
– కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన 8 నెలలలో 6 సార్లు CMRF చెక్కులు అందచేశాం.
– సిఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనుసున్న ముఖ్యమంత్రి అని వేమిరెడ్డి దంపతులు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు ప్రశంసించారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో వేమిరెడ్డి దంపతుల చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు 18 లక్షల 39 వేల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన 8 నెలల వ్యవధిలో కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికి 6 సార్లు CMRF చెక్కులు అందచేశామన్నారు. గతంలో CMRF కు అప్లై చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి వుండేదన్నారు. అనారోగ్య పీడితులు సహాయం ఆర్ధించి అప్లై చేసుకున్న వెంటనే మానవతా దృక్పధంతో మంజూరు చేస్తున్న ముఖమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె ధన్యవాదాలు తెలియచేసారు. కోవూరు నియోజకవర్గంలో ఇప్పటి CMRF (ముఖ్యమంత్రి సహాయ నిధి) మరియు LOC లెటర్ ఆఫ్ క్రిడెట్) ద్వారా కోవూరు నియోజకవర్గంలో 85 లక్షల 93 వేల రూపాయల విలువైన చెక్కులు పంపిణి చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా CMRF చెక్కులు అందుకున్నపలువురు తమను ఆర్ధికంగా ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డి, ఇందుకూరుపేట టిడిపి అధ్యక్షులు రావెళ్ల వీరేంద్రనాయుడు, టిడిపి సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, షేక్ జమీర్, ఆవుల వాసు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.