నిరాశ్రయుల కేంద్రం పునరుద్దరణ పనులను వెంటనే చేపట్టండి
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఉన్న నిరాశ్రయుల శిబిరాన్ని పూర్తి స్థాయిలో పునరుద్దరించి, రాష్ట్రంలోనే ఆదర్శ కేంద్రంగా తీర్చిదిద్దాలని కమిషనర్ సూర్య తేజ అధికారులను ఆదేశించారు.
కమిషనర్ బుధవారం స్థానిక పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలోని నిరాశ్రయుల శిబిరాన్ని సందర్శించి శిబిరంలో ఉన్న వారందరికీ సబ్బు, నూనె, ఇతర కాస్మోటిక్స్, దుప్పట్లు, నూతన వస్త్రాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందించారు. అలాగే ప్రతి నెలా క్రమం తప్పకుండా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం ఏ.ఆర్.డి.పి.డి నిర్వహణలోని నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రము, నెల్లూరు నగరపాలక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు 40 మంది నిరాశ్రయులకు అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారాన్ని మూడు పూటలా అందిస్తున్నామని కమిషనర్ తెలిపారు.
నిరాశ్రయుల కేంద్రం పూర్తిస్థాయిలో పునరుద్ధరించి స్లాబ్ వర్క్, కార్పెంటర్ వర్క్, ఎల్ట్రికల్ , పెయింటింగ్ లు తదితర అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసేంతవరకు నిరాశ్రయులకు వేరే ప్రాంతంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో ఏ.ఆర్.డి.పి.డి. నిర్వాహకులు దాసరి సుందరం, మదన్ మిశ్రా, నగరపాలక సంస్థ యం.హెచ్.ఓ. డాక్టర్. చాణక్య , ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ.లు రహంతు జాని, శ్రీనివాసరావు, డి.ఈ.ఈ.రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.