*నారాయణ సార్…మీ విజయమే మా లక్ష్యం : జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్*
– మాజీ మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత నూనె
– నారాయణను శాలువాలతో సత్కరించిన జనసేన నేతలు
ఇటీవల జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ సమక్షంలో…వైసీపీ నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ జనసేన తీర్ధం పుచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా… నెల్లూరు నగరం గోమతి నగర్‌లోని నారాయణ క్యాంప్ కార్యాలయంలో… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణను…నూనె మల్లికార్జున యాదవ్ జనసేన నాయకులతో కలిసి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ముందుగా…నారాయణను ఆయన శాలువాలతో సత్కరించి పూలబొకే అందచేశారు. నెల్లూరులో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నూనె మల్లికార్జున యాదవ్ నారాయణకు తెలిపారు. అదే విధంగా రానున్న ఎన్నికల్లో నారాయణ సార్…మీ విజయమే మా లక్ష్యంగా జనసైనికులందరంద కష్టపడి పని చేస్తామని హామీ ఇచ్చారు. నూనె మల్లికార్జున యాదవ్ జనసేనలోకి రావడం సంతోషకరమని పొంగూరు నారాయణ అన్నారు. ఎన్టీఏ కూటమిలో చేరే ప్రతీ ఒక్కరికి సముచిత స్థానంతోపాటు…గౌరవం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.