*నాన్నగారితోనే అభివృద్ధి సాధ్యం — ఆదాల హిమబిందు*
*నాన్నగారు చేసిన అభివృద్ధిని ప్రజలు వివరించడం సంతోషం — ఆదాల హిమబిందు*
*గడచిన నాలుగేళ్లలో రూరల్ అభివృద్ధి శూన్యం — ఆదాల హిమబిందు*
*22వ డివిజన్లో రూరల్ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దత్తుగా ఆయన కుమార్తె ఆదాల హిమబిందు ఇంటింటా ఎన్నికల ప్రచారం*
నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి నాన్నగారు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డితోనే సాధ్యపడుతుందని ఆదాల హిమబిందు స్పష్టం చేశారు. గత ఏడాదికి ముందు నాలుగు సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్థానిక ఆయా ప్రాంతాల ప్రజలు చెప్పడం విచారకరమని రూరల్ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు చెప్పారు. గడచిన తొమ్మిది నెలల కాలంలో నాన్నగారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాల గురించి తాను ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఆయా ప్రాంతాల ప్రజలు తనకు స్వయంగా చెబుతూ నాన్నగారు చేసిన అభివృద్ధిని గురించి సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందంగా ఉందని ఆదాల హిమబిందు చెప్పారు. రానున్న ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా నాన్నగారు ఆదాల ప్రభాకర్ రెడ్డిని, నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని రూరల్ ప్రజలు వారి అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవకాశం ఉంటుందని ఆదిశగా ప్రజలు సమిష్టిగా ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆదాల హిమబిందు స్థానిక ప్రజలను కోరారు. ఈ మేరకు మంగళవారం 22వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో ఆ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, స్థానిక ప్రజలతో కలిసి *ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి దిశా నిర్దేశంలో నిర్వహించారు*. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ వైస్సార్సీపీ నాయకులు కొండారెడ్డి, మునుస్వామిరెడ్డి, వెంకురెడ్డి, వెంకటరెడ్డి, దశయ్య, చెంచయ్య, శేషారెడ్డి, కృష్ణారెడ్డి, వెంకురెడ్డి, వెంకట రామయ్య, నరేష్, వెంకీ, సాయి, తదితరులతోపాటు 23వ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులురెడ్డి, క్లస్టర్ -2 అధ్యక్షులు పాతపాటి పుల్లారెడ్డి, ఏపీ స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ పాశం శ్రీనివాస్, నగర పార్టీ ఉపాధ్యక్షులు వేలూరు శ్రీధర్ రెడ్డి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి లంక రామశివారెడ్డి, నగర పార్టీ మహిళ అధ్యక్షురాలు కాకుంటూరు లక్ష్మిసునంద, వైసీపీ నాయకులు రొంపిచర్ల సుబ్బారెడ్డి, టి. శ్రీకాంత్, పాశం తిరుపతి, దారా వంశీ, పామూరు మస్తాన్ రెడ్డి, వేమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, టియల్ఎఫ్ అధ్యక్షులు నండూరి హరిత రెడ్డి, ముంగమూరు భార్గవిరెడ్డి స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.