*నాడు చెత్త పై పన్ను – నేడు చెత్త నుంచి సంపాదన*
– చంద్రబాబు విజనరీ లీడర్.
– పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత.
– నెల్లూరుకు ఎయిర్ పోర్టు చాలా అవసరం.
– ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
బిపిసిఎల్, ఇండోసోల్ లాంటి భారీ పరిశ్రమలు తాను ప్రాతినిధ్యం వహించే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాక సందర్బంగా కందుకూరు AMC యార్డులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బిపిసిఎల్, ఇండోసోల్ రాకతో జిల్లాలో వేలాది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. చెత్త పై పన్ను వేసే దుర్మార్గపు పాలన అంతరించి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చెత్త నుంచి సంపద సృష్టించే ప్రభుత్వం వచ్చిందన్న ఎంపి వేమిరెడ్డి గారి మాటలతో సభకు హాజరైన ప్రజానీకం కరతాళ ధ్వనులతో ప్రతిస్పందించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా అభివర్ణించారు. పరిసరాల శుభ్రతతో ఆరోగ్యంతో పాటు సంపద సమకూరుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు కు ఎయిర్ పోర్ట్ అవసరమన్న విషయాన్ని సిఎం చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ దగదర్తి విమానాశ్రయ నిర్మాణం పై దృష్టి సారించాలని కోరారు.