*నాగరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డిగారి సతీమణి ఉత్తరక్రియల్లో పాల్గొన్న ఆదాల*
నాగారెడ్డి లక్ష్మీనారాయణరెడ్డిగారి సతీమణిగారు కాలంచేశారు. ఈ నేపథ్యంలో వారి ఉత్తర క్రియలకు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు హాజరయ్యారు. ఈ మేరకు గురువారం నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లోని నాగారెడ్డి లక్ష్మీనారాయణరెడ్డిగారి సతీమణి గారికి మాజీ ఎంపీ ఆదాల అశ్రునివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని పరామర్శించారు. నాగారెడ్డి లక్ష్మీనారాయణరెడ్డిగారి సతీమణిగారి ఉత్ క్రియలో పాల్గొన్నవారిలో నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రెడి రంగారెడ్డి, వైస్సార్సీపీ నాయకులు స్వర్ణ వెంకయ్య, పాశం శ్రీనివాస్, మల్లు సుధాకర్ రెడ్డి, సీహెచ్ హరిబాబు యాదవ్, నాగా శ్రీనివాసులురెడ్డి, కల్లూరు లక్ష్మిరెడ్డి, షేక్ అల్లాబక్షు, బెల్లకొండ వెంకయ్య తదితరులు ఉన్నారు.