SPS నెల్లూరు జిల్లా,

*నవాబ్ పేట పోలీస్ స్టేషన్ సందర్శించిన నెల్లూరు టౌన్ ఏఎస్పీ శ్రీమతి దీక్ష, ఐపీఎస్.,*

 జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, నెల్లూరు టౌన్ ఏఎస్పీ శ్రీమతి దీక్ష, ఐపీఎస్ గారు నవాబ్ పేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
• నెల్లూరు టౌన్ లో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే PD-Actలు అమలు చేస్తాం.
• రౌడీ, KD, DCల కదలికలపై పటిష్ఠ నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.
• నేరాలకు పాల్పడి జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని తెలిపారు.
• నేర ప్రవృత్తిని విడిచిపెట్టి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని సూచించారు.
• పద్ధతులు మార్చుకోండి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి అని స్పష్టం చేశారు.
• రౌడీ షీటర్లు ప్రస్తుతం జీవిస్తున్న విధానం, జీవనోపాధి కోసం చేస్తున్న వృత్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
🔹 ఫుట్ పెట్రోలింగ్ :
• అనంతరం నవాబ్ పేట పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి, ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రజలతో మాట్లాడారు. నెల్లూరు టౌన్ ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.
• నెల్లూరు టౌన్ లో నేరాల నియంత్రణ, ఓపెన్ డ్రింకింగ్ అరికట్టుట, విజబుల్ పోలీసింగ్ నిర్వహణతో పాటు మహిళలపై జరిగే నేరాలను అరికట్టుటకు ప్రత్యేక దృష్టి సారిస్తామని ఏఎస్పీ గారు స్పష్టం చేశారు.
• నిబంధనలు, సమయపాలన పాటించకుండా తెరిచి ఉన్న అన్ని రకాల షాపులు మూసివేయించారు. యజమానులకు తగిన సూచనలు, సలహాలు అందించారు. అందరూ CCTV కెమెరాలను ఏర్పాటు చేసుకొని, నిబంధనలు పాటిస్తేనే వ్యాపారాలకు భద్రత అని సూచించారు.

నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం, తేది.22.01.2026.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *