*నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఆ సెంటరే*
*లేదంటే స్నేహితుల్లా నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేసే పరిస్థితి ఉండేదేమో*
*ఆర్ఎస్ఆర్ స్కూలు పూర్వవిద్యార్థుల సమావేశంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
నెల్లూరు ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూలు 1969-70 టెన్త్ బ్యాచ్ విద్యార్థులందరం ఒక చోట కలుసుకోవడం చాలా షంతోషం కలిగించింది
మా క్లాస్ మేట్స్ లో కొందరు డాక్టర్లు, యూనివర్సిటీ డీన్లు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, అడ్వకేట్లు ఉన్నారు
వీళ్లంతా రాజకీయాల్లోకి రాకుండా తమ తమ వృత్తుల్లో ప్రశాంతమైన జీవితం సాగిస్తున్నారు
నాలా నిత్య పోరాటాలు, ఆర్థిక సమస్యలు.. చివరకు శ్రీనివాస మహల్ ను అమ్మే పరిస్థితులు లేకుండా సంతోషంగా జీవిస్తుండటం ఆనందంగా ఉంది
మేము చదువుకునే రోజుల నుంచి మా శ్రీనివాస మహల్ రాజకీయాలకు కేంద్రంగా ఉండేది. ఆనం వాళ్లకు ఏసీ సెంటర్ అయితే, ఆనం వ్యతిరేక వర్గానికి కేరాఫ్ శ్రీనివాస మహల్
శ్రీనివాస మహల్ కేంద్రంగా ఉమ్మడి నెల్లూరుతో పాటు పాత నెల్లూరు జిల్లాలో భాగమైన దర్శి, పొదిలి, కనిగిరి తదితర ప్రాంతాల రాజకీయాలు జరిగేవి…ఎందరో రాజకీయ ప్రముఖులు అక్కడికి వచ్చేవారు
అందరినీ చూస్తూ పెరిగి నేను చదువుకు దూరమై రాజకీయాల్లోకి వచ్చాను..లేదంటే నేను కూడా చదువుకుని ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడే పరిస్థితి ఉండేదేమో
ఆర్ఎస్ఆర్ హైస్కూలు నాకు అనేక విషయాల్లో స్ఫూర్తి…అందులో భాగంగానే అల్లీపురం, నవలాకులతోటలో జెడ్పీ హైస్కూళ్ల నిర్మాణానికి మా తండ్రి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరుతో స్థలాలిచ్చాం
ఆ రెండు హైస్కూల్స్ ఈ రోజు మేమిచ్చిన కోట్లాది రూపాయల విలువైన స్థలాల్లో కొనసాగుతుండటం చాలా తృఫ్తిగా ఉంది