*నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం లో భూములు కోల్పోతు న్న రైతులకు పరిహారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది : బిజెపి నేత మిడతల రమేష్*
గ్రామాలలో పరిహారం విషయంలో వస్తున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని *నెల్లూరు ఆర్డీవో కార్యాలయం డి ఏ ఓ అనిల్ కు బిజెపి నేత మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు*
దుగ్గుంట వావింటపర్తి అంకుపల్లి పంచాయతీలలో రైల్వే లైన్ సర్వే జరిపి *ఆరు సంవత్సరాలు* పూర్తయింది
భూ సేకరణ మార్కింగ్ చేసి *రాళ్లు నాటి నాలుగు సంవత్సరాలయింది*
అర్హత పొందిన అవార్డుదారులకు పరిహారం ఇవ్వడంలో మాత్రం తీవ్రమైన జాప్యం జరుగుతోంది .
కేంద్ర ప్రభుత్వం నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కొరకు *అమృత భారత్ పథకం* కింద నిధులు విడుదల చేసి ఉంది
వావింట పర్తి గ్రామంలో ఒకళ్ళిద్దరు మినహా మిగిలిన రైతులు పరిహారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు
అయినప్పటికీ ఆర్డిఓ కార్యాలయంలో రైల్వే లైన్ పరిహార జాబితా పెండింగ్లో ఉండడం దురదృష్టకరం.
పొదలకూరు మండలంలో కొంతమంది రైతులు తక్కువ నష్టపరిహారం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ప్రభుత్వం వెంటనే మార్కెట్ ధరల ప్రకారం నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రమేష్ ప్రభుత్వం నుడిమాండ్ చేశారూ
ఈ కార్యక్రమంలో అల్లి రవికుమార్ యాదవ్ తో పాటు రైతులు పాల్గొన్నారు