*నగర మేయర్ స్రవంతి చేతులమీదుగా ఏబీవీపీ రాష్ట్ర మహాసభల గోడ పత్రికల ఆవిష్కరణ*
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఈనెల 24,25,26 వ తేదీలలో జరగబోయే 43వ రాష్ట్ర మహాసభల యొక్క గోడపత్రికలను నెల్లూరు మేయర్ P. స్రవంతి
విష్ణువర్ధన్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎబివిపి నెల్లూరు నగర నాయకులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ నిరంతరం విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతూ విద్యార్థుల్లో జాతీయత భావాలను నింపుతూ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు నెల్లూరు నుంచి విద్యార్థులు కార్యకర్తలు మహాసభలలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వీళ్లు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖ గంగాధర్ గారు, నగర సహాయ కార్యదర్శి సుకుమార్ నాయకులు యశ్వంత్, రాబర్ట్, శివ, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.