*నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, వంద శాతం లక్ష్యాలను సాధించాల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన.కమిషనర్ సూర్య తేజ*
నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో వారాంతపు సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పన్నుల వసూళ్లకు ప్రతిరోజు ఉదయం నుంచి ప్రతి కార్యదర్శి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అందుబాటులో లేని భవన యజమానులను ఫోన్ ద్వారా సంప్రదించి ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
సచివాలయాల వారీగా సంబంధిత డి.ఈ.లు ఏ.ఈ. లు పన్ను వసూళ్ల ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొని బకాయిలు వసూళ్లు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లలో వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ అమెనిటీస్ కార్యదర్శులు వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ సూచించారు.
అదేవిధంగా సచివాలయాల వారిగా క్రమం తప్పకుండా తాగునీటి నాణ్యత పరీక్షలను నిర్వహించి ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా నమోదు చేయించాలని సూచించారు. సచివాలయాల పరిధిలో రోడ్లపై ఉన్న గుంతల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని, వంద శాతం గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రతి ఒక్క అమెనిటీస్ కార్యదర్శి కృషి చేయాలని సూచించారు.
విద్యుత్ స్తంభం ఉన్న ప్రతి చోట తప్పకుండా విద్యుత్ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, జంక్షన్లలో, ఇతర అవసరమైన ప్రాంతాలలో ఎక్కువ వెలుగులను ఇచ్చే హైమాక్స్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రామ్ మోహన్ రావు, ఈ.ఈ. శేషగిరిరావు, డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.లు,వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.