నగరాభివృద్ధిలో భాగస్వాములు కండి
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి సరైన సూచనలు అందించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నెల్లూరు వెల్ఫేర్ ఫెడరేషన్ సభ్యులకు కమిషనర్ సూర్య తేజ సూచించారు. నెల్లూరు వెల్ఫేర్ ఫెడరేషన్ 8 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రామ్మూర్తి నగర్ లోని పద్మావతి కమ్యూనిటీ హాల్ లో వేడుకలను గురువారం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ పాల్గొని నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వివిధ అంశాలపై మాట్లాడారు. నగరవ్యాప్తంగా రోడ్లపై ఉన్న గుంతలను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తున్నామని, విద్యుత్ వీధి దీపాల వెలుగును మరింతగా పెంచి వీధి దీపాల సంఖ్యను కూడా పెంచామని తెలిపారు. అదేవిధంగా ప్రజాపార్కుల నిర్వహణలో స్థానిక అసోసియేషన్లు, ఫెడరేషన్ల పాత్ర ఎంతో కీలకమని పార్కుల అభివృద్ధిలో వారి సలహాలు సూచనలను తీసుకొని మెరుగైన వసతులను కల్పిస్తున్నామని కమిషనర్ తెలియజేశారు.
కార్యక్రమంలో భాగంగా లొకాలిటీ అసోసియేషన్స్ గైడెన్స్ కు సంబంధించిన పుస్తకాన్ని కమిషనర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు కృష్ణయ్య, అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి పి ఎస్ పి నాయుడు, జాయింట్ సెక్రెటరీ శ్రీకాంత్ రెడ్డి, ట్రెజరర్ శ్రీనివాసచారి ఇతర సభ్యులు పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.