నగరాభివృద్ధికి సమగ్రమైన బడ్జెట్ ను రూపొందించండి
– కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా సమగ్రమైన నూతన బడ్జెట్ ను రూపొందించాలని కమిషనర్ సూర్య తేజ అధికారులను ఆదేశించారు.
నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులతో బడ్జెట్ రూపకల్పన సమావేశాన్ని కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నగరపాలక సంస్థకు బడ్జెట్ కేటాయింపులో భాగంగా అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకొని, వారి సలహాలు, సూచనలు తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను రూపొందించాలని సూచించారు.
నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించాలని, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపేందుకు ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ ను పొందుపరచాలని సూచించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు,యస్.ఈ.రామమోహనరావు,డీ.సీ.పీ.పద్మజ, మేనేజర్ ఇనాయతుల్లా, అకౌంటెంట్ పద్మజ, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.