నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ రూపకల్పన
– మేయర్ స్రవంతి జయవర్ధన్
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ ను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు.
నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులతో బడ్జెట్ రూపకల్పన సమావేశాన్ని మేయర్ చాంబర్లో మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నగరపాలక సంస్థకు బడ్జెట్ కేటాయింపులో భాగంగా అన్ని విభాగాల అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని తుది మెరుగులు దిద్దుతున్నామని తెలిపారు.
నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించనున్నామని తెలిపారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నగర పాలక సంస్థ బడ్జెట్ కేటాయింపులు చేపట్టామని, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపేందుకు ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ ను రూపొందించనున్నామని మేయర్ ప్రకటించారు.
విభాగాల వారీగా రూపొందించిన బడ్జెట్లో నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనులకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ కేటాయింపులు జరపనున్నామని, అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను ప్రతిష్టాత్మకంగా రూపొందించి, అమలు చేస్తామని మేయర్ వెల్లడించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.