నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో టౌన్ ప్లానింగ్ సిబ్బందితో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమీక్ష సమావేశంలో ఇన్చార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొని అధికారులు కార్యదర్శులతో మాట్లాడారు.

మేయర్ గా తాను ఉన్న పదవీకాలంలో నూతన సంస్కరణలతో నగరవ్యాప్తంగా కొత్త మార్పు కనబడేందుకు దోహదపడాలని ఆకాంక్షించారు. నాలుగవ అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్న నెల్లూరుకు రాబడి పెంచుకునే మార్గాలను సుగమం చేసుకుంటూ, దుబారా ఖర్చులను పూర్తిస్థాయిలో తగ్గించుకుందామని మేయర్ సూచించారు. ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అనంతరం కమీషనర్ మాట్లాడుతూ ప్లానింగ్ కార్యదర్శుల లాగిన్లలో ఉన్న ఎల్.ఆర్.ఎస్ పాటర్న్స్ పరిశీలించి వెంటనే తదుపరి అనుమతుల కొరకు అధికారులకు పంపవలసిందిగా ఆదేశించారు.

అలాగే గత వారం నుంచి ఈ వారంలోపు జరిగిన ఎల్.ఆర్.ఎస్ పాటర్న్స్ గురించి కార్యదర్శి వారీగా సమీక్షించారు.

అలాగే సచివాలయ పరిధిలోని అడ్వర్టైజ్మెంట్ పన్నులు, టెంపరరీ ఎంక్రోచ్మెంట్ పన్నులు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు నివేదికను అందించవలసిందిగా ఆదేశించారు.

నగరపాలక సంస్థ కార్యాలయానికి ఆదాయం వనరులు సమకూరేల ప్రతి కార్యదర్శి పనిచేయాలని నిర్దేశించారు. సచివాలయ పరిధిలోని గవర్నమెంట్ ఆస్తులను గుర్తించి వివరములను అందజేయవలసిందిగా ఆదేశించారు. కార్యాలయ పురోగతి పై నిర్దేశించిన పనులను తప్పక పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ వేణు, సూపరిండెంట్ ప్రవీణ్ కుమార్, టీ.పీ.బి.వోలు, ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed