
*నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ నగరంలో ముంథా తుఫాను నేపథ్యంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.*
నగరంలో విస్తారంగా కురుస్తున్న వర్షం వలన రోడ్డు పై నీరు నిలబడకుండా కాలువలలో సులభముగా పారుటకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు.
నగరంలోని స్థానిక చందనా బ్రదర్స్ ట్రంకు రోడ్డు వద్ద డ్రైన్ కాలువ బ్లాక్ అవడంతో రోడ్డుపై వర్షపు నీరు నిలబడిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన కారణంగా కమిషనర్ పర్యవేక్షించి పూడికతీత పనులను చేపట్టారు.
ముంథా తుఫాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు డ్రైన్ కాలువల వరదనీటి ప్రవాహాన్ని కమిషనర్ మంగళవారం నగరవ్యాప్తంగా పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక గాంధీ బొమ్మ కూడలి ట్రంకు రోడ్డు తదితర ప్రాంతాలలో రైలు కాలువలను పరిశీలించి బ్లాక్ అయిన ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన క్లియరెన్స్ చర్యలు చేపట్టమని సిబ్బందిని ఆదేశించారు.
రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలవకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
అదేవిధంగా స్థానిక 24 / 3 ఇందిరమ్మ కాలనీ రెండవ వీధి ప్రాంతంలో భారీ వర్షాలకు కూలిపోయిన పెద్ద వృక్షాన్ని కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు శానిటేషన్ కార్యదర్శి నేతృత్వంలో సచివాలయ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది తొలగించి వీధిలో క్లియరెన్స్ పనులను చేపట్టారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అరవ శ్రీనివాసులు, సచివాలయ కార్యదర్శులు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
*Commissioner Sri Y.O.Nandan is continuously visiting all cyclone-affected low-lying areas across Nellore city and monitoring the facilities arranged at rehabilitation centers within NMC jurisdiction. Clog removal and major drain clearance works are being carried out round the clock to ensure smooth water flow.*
*The Commissioner is also monitoring control room helpline complaints and giving instructions to staff for immediate redressal of issues during the cyclone. Urban Primary Health Centers are being closely monitored to ensure timely medical support and health care services to the affected people.*