
*నగరంలోని బిల్లులు రాని అనాథరైజ్డ్ వాటర్ ట్యాప్స్ ను గుర్తించి వారి వద్ద చలానా రూపంలో నగరపాలక సంస్థ ఖజానాకు జమ చేయించి రెగ్యులర్ చేయండి : కమిషనర్ వై ఓ నందన్*
నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఇంజనీరింగ్ విభాగంతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని బిల్లులు రాని అనాథరైజ్డ్ వాటర్ ట్యాప్స్ ను గుర్తించి వారి వద్ద చలానా రూపంలో నగరపాలక సంస్థ ఖజానాకు జమ చేయించి రెగ్యులర్ చేయించవలసిందిగా ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.
2025 – 2026 ఫైనాన్షియల్ సంవత్సరం ముగిసేలోపు నగరపాలక సంస్థ పరిధిలో ఎటువంటి అనాథరైజ్డ్ కొళాయిలు ఉండేదానికి వీలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఇబ్బంది ఆదేశించారు.
2025 – 2026 సంవత్సరమునకు కొళాయి పన్ను డిమాండ్ 41 కోట్లు అందుకుగాను ఇప్పటివరకు 6.27 కోట్లు మాత్రమే వసూలు చేసి ఉన్నారని, ఇంకా 35 కోట్లు ఐదు నెలల లోపు వసూళ్లు చేయాల్సి ఉందని ఈ సందర్భంగా కమిషనర్ తెలియజేశారు.
డిసెంబర్ నెల 13వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ జరగనున్నదని ఇందులో భాగంగా నగరంలో ఐదు వేలు, అంతకుమించి బకాయి ఉన్న బకాయిదారులకు నోటీసులు జారీ చేయవలసినదిగా కార్యదర్శులు, ఫిట్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లకు కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో ఎస్.ఈ. రామ్మోహన్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శేషగిరిరావు, రహంతు జానీ, అనిల్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సచివాలయ కార్యదర్శులు, ఫిట్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.