*ధాన్యం రైతులు నష్టపోకుండా చూడాలని రాష్ట్ర *పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి* లకు బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ విజ్ఞప్తి *
రైతు సేవ కేంద్రంలో తేమతో సంబంధం లేకుండా దాన్ని సేకరించాలని కోరారు.
సేకరించిన ధాన్యాన్ని మిల్లులలో అన్లోడింగ్ అయ్యే వరకు సివిల్ సప్లై అధికారులు బాధ్యత తీసుకోవాలని మంత్రులకు రమేష్ విజ్ఞప్తి చేశారు
17 శాతం తేమ దాటిన తర్వాత 18 శాతానికి వందకు ఒక కేజీ చొప్పున22 శాతం వరకు 5 కేజీలుచొప్పున రైతులు వద్ద తీసుకోవాలని అటువంటి పద్ధతి గతంలో ప్రభుత్వం అనుసరించిందని అప్పుడు రైతులు లాభపడ్డారని రమేష్ సూచించారు
నెల్లూరు జిల్లాలో చెరువులు వాగులు పోరంబోకుల కింద కనీసం *లక్ష ఎకరాలకు పైగా అనధికారిక వరి పైరు సాగు చేసి ఉన్నారు*. ఈ పంటను ఈ క్రాప్ లో నమోదు చేయలేదు లక్ష ఎకరాలలో రైతుల నష్టపోకుండా వారికి కూడా ఆర్ఎస్కే ల ద్వారా ధాన్యం సేకరించాలని ప్రభుత్వాన్ని కోరారు
నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ గతంలో రైతులకు చెందాల్సిన హమాలీ కూలీల చార్జీలు రవాణా చార్జీలు లో ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగింది.
ఆ అవినీతిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం రైతులు నష్టపోకుండా రవాణాచార్జీలు హమాలీ చార్జీలు నేరుగా రైతుల అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని రమేష్ విజ్ఞప్తి చేశారు