దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోండి
– కమిషనర్ వై. ఓ. నందన్
నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లో ప్రతి 14 రోజులకు ఒకసారి ఫాగింగ్ ప్రక్రియను అమలు చేస్తూ, ఆయిల్ బాల్స్ పిచికారి, గంబుజియా చేప పిల్లల పెంపకం తదితర కార్యక్రమాలతో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిషనర్ వై.ఓ. నందన్ సూచించారు.
పబ్లిక్ హెల్త్ విభాగం, వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఐ.వి.ఆర్.ఎస్ విధానంలో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పారిశుధ్య నిర్వహణ పనుల సంతృప్తి 70 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు గుర్తించామని, దానిని మెరుగుపరిచేందుకు అందరూ కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
రోడ్లపై నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, సిమెంట్ బస్తాలు, బ్యాగులు, ఇతర వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేలా పర్యవేక్షించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు అంతర్గత బదిలీలను చేపట్టాలని, గృహాల నిష్పత్తి ప్రకారం కార్మికుల కేటాయింపు జరపాలని కమిషనర్ సూచించారు.
24 గంటల్లో గార్బేజి ల నుంచి చెత్తను సేకరించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని, ఇంటింటి చెత్త సేకరణలో తప్పనిసరిగా తడి పొడి చెత్తను విడిగా సేకరించేలా పారిశుద్ధ సిబ్బందిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. శానిటేషన్ మేస్త్రీలు విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రధాన రోడ్లు, వీధుల పరిశుభ్రతలో భాగంగా ఏ ప్రాంతాన్ని అసంపూర్తిగా వదలకుండా రోడ్ల చివరి వరకు ఎండ్ టు ఎండ్ శుభ్రం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో ఫ్లోర్ పాయింట్లు అన్నవి లేకుండా పూర్తిగా తొలగించాలని ఆదేశించారు.
స్పెషల్ శానిటేషన్ వర్క్స్ లలో భాగంగా డ్రైను కాలువల పొడవులను బట్టి కార్మికులను కేటాయించి గ్యాంగ్ వర్కులు చేయించాలని సూచించారు.
చెత్త సేకరణ వాహనాలు చెత్తను తరలించే సమయంలో వ్యర్ధాలు రోడ్లపై పడకుండా తప్పనిసరిగా పూర్తిస్థాయిలో కప్పి ఉంచేలా జాగ్రత్త చర్యలు తీసుకునేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.
అన్ని డివిజన్లలో క్రమం తప్పకుండా డ్రైన్ కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులను చేపట్టాలని, తడి పొడి చెత్తను విడివిడిగా సేకరించేలా సిబ్బందిని పర్యవేక్షించాలని అదనపు కమిషనర్ ఆదేశించారు.
వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకొని అవుట్డోర్ విభాగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ రక్షణ కొరకు టోపీలను కమిషనర్ అందజేశారు.
ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, మలేరియా విభాగం అధికారి జిజియా బాయి, వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్, శానిటేషన్ సూపరింటెండెంట్, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, మేస్త్రీలు, సిబ్బంది పాల్గొన్నారు