దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి
– కోవూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.
– యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం.
– స్కూల్స్ లో ప్రతిరోజూ ఓ గంట యోగ సాధన చేయించాలి.
– ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరులో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె కోవూరులోని బాలికల పాఠశాలలో నిర్వహించిన యోగాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు మరియు వందలాదిగా పాల్గొన్న స్థానిక ప్రజలతో కలిసి ఆమె యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోడి గారి ఆధ్వరంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం రాష్టానికి గర్వకారణమన్నారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ప్రజలలో స్ఫూర్తి నింపేదుకై చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖలో నిర్వహించారన్నారు. సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యమన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు. ప్రతి పాఠశాలలో రోజుకో గంట విద్యార్థినీ, విద్యార్థులకు యోగ శిక్షణా తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. హెల్తీ, వెల్తి, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ గార్ల స్పూర్తితో ప్రతి ఒక్కరు దైనందిన జీవితంలో యోగాసన సాధన చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులతో పాటు బాలికల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.