దేశ రాజధానిలో కమల వికాసం – ఆప్‌ను తిరస్కరించిన ప్రజలు, భాజపాకు ఘన విజయం
బిజెపి జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు మార్పును కోరుకున్నారనీ ఆప్ పార్టీని ఖండించి, భాజపాకు విశ్వాసంతో ఓటు వేశారనీ బిజెపి జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని స్పష్టంగా నిరూపించాయని ,అధికార పార్టీ వైఫల్యాలు, మోసపూరిత హామీలు, పాలనా దౌర్భాగ్యం నేపథ్యంలో, ఢిల్లీ ప్రజలు భాజపా నాయకత్వాన్ని గట్టిగా బలపరిచారన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది అని ,ఆప్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తోంది, కానీ భాజపా మాత్రం అభివృద్ధి, పారదర్శక పాలన, జాతి ప్రగతికి కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు.
“ఢిల్లీ ప్రజలు భాజపాకు పట్టం కట్టడం భారత రాజకీయాల్లో గణనీయమైన మలుపు. ఈ విజయం ప్రజల ఆశయాల విజయంగా నిలుస్తుంది. భాజపా పాలన అంటే అభివృద్ధి, శుభపాలన, ప్రజా సంక్షేమం – అందుకే దేశవ్యాప్తంగా ప్రజలు మోదీ నాయకత్వాన్ని నమ్ముతున్నారు!” అని ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ గెలుపుతో ఢిల్లీలో కొత్త రాజకీయ హోరును భాజపా సృష్టించిందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజానీకానికి భాజపా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.