_*​దేశ నిర్మాణంలో మౌలానా ఆజాద్ కీలకపాత్ర: రిజిస్ట్రార్ డా. కె. సునీత*_

………………………………………….
​భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జరుపుకునే జాతీయ విద్యా దినోత్సవం నాడు, రిజిస్ట్రార్ డాక్టర్ కే. సునీత ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ విద్యా వ్యవస్థకు ఆజాద్ అందించిన సేవలను ఆమె ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
​ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ కే. సునీత మాట్లాడుతూ —
“మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విశిష్ట విద్యావేత్త మరియు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడు. ఆయన దేశ విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు వేశారు. భారత తొలి విద్యామంత్రిగా ఉన్న సమయంలో ఐఐటీలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) వంటి సంస్థలను స్థాపించడం ద్వారా భారత విద్యా రంగానికి అమూల్యమైన సేవలు అందించారు. యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి” అని తెలిపారు.
​ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ విజయ, ఆచార్య టి వీరారెడ్డి, యన్ ఈ పి కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ మధుమతి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ అల్లం ఉదయ్ శంకర్, పి ఆర్ ఓ డాక్టర్ కోట నీలంమణికంఠ డాక్టర్ సిహెచ్ కిరణ్మయి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ ఆర్ వి ఎస్ ఎస్ నాగభూషణరావు, డాక్టర్ సుచరిత పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని మౌలానా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed