*దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి*
*జమిలి ఎన్నికలతో అనేక ప్రయోజనాలు*
*తెలంగాణకు హైదారాబాద్ ఉంటే ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నారు*
*అప్పట్లో విజన్ 2020 – ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047, పీ4తో ముందుకు*
*ఒకే దేశం – ఒకే ఎన్నికల అంశంపై వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో నిర్వహించిన వికసిత భారత్ యూత్ పార్లమెంటు సెమినార్ లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
24 పి.హెచ్.డీలు పొందిన అల్లం శ్రీనివాసరావు మన యూనివర్సిటీకి వీసిగా నియమితులు కావడం శుభపరిణామం
రాజకీయ జోక్యానికి సంబంధం లేకుండా మంచి విద్యానిపుణుడిని ప్రభుత్వం మనకు వీసిగా పంపడం ఆనందదాయకం
ఒకే దేశం – ఒకే ఎన్నికలు అంశంపై మన యూనివర్సిటీలో రెండు రోజుల సెమినార్ ను చేపట్టడాన్ని స్వాగతిస్తున్నాను
విద్యార్థులు తమ సత్తా చాటి జాతీయ స్థాయిలో జరిగే యువజన పార్లమెంటు 2025లో ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షిస్తున్నాను.
మన రాష్ట్రంలోనూ 175 మంది యువతతో యువజన అసెంబ్లీ నిర్వహించే సన్నాహాల్లో యువమంత్రి నారా లోకేష్ బాబు ఉన్నారు
1950ల్లో దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగేవి
ఆ తర్వాత కాలంలో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయి మధ్యంతర ఎన్నికలు రావడంతో ఆ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది
పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత ఏటా ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తూనే ఉన్నాయి
ఎన్నికల షెడ్యూల్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకూ కొత్త నిర్ణయాలు ఉండవు, నిధుల కేటాయింపు ఉండదు..ఫలితంగా కీలక సమస్యల పరిష్కారానికి అవాంతరం ఏర్పడుతుంది
ఎన్నికల కారణంగా పరిపాలనకు అవాంతరాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం జమిలి ప్రతిపాదనను తెచ్చింది
చంద్రబాబు నాయుడు మొదటిపారి సీఎంగా ఉన్న సమయంలో విజన్- 2020 అంటే అప్పట్లో కొందరు హేళనగా మాట్లాడారు
20 ఏళ్ల తర్వాత అభివృద్ధి గురించి ఇప్పుడెందుకుని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు
హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ తదితర ఎన్నో ప్రాజెక్టులకు విజన్ 2020లో భాగంగా చంద్రబాబు నాయుడు బీజం వేశారు
ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు, ఐటీ విప్లవం ద్వారా ప్రపంచమంతా ఉమ్మడి ఏపీవైపు చూసేలా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు
ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047, పీ4 నినాదాలతో ముందుకు సాగుతున్నారు
రాష్ట్రానికి నడిబొడ్డున అందరికీ అందుబాటులో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తున్నారు
గత ఐదేళ్లూ మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసి అత్యంత విలువైన సమయాన్ని వృథా చేశారు
హైదరాబాద్ ను పోగొట్టుకున్నా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నాం
రాష్ట్రానికి 900 కిలోమీటర్లకు పైగా కోస్తా ప్రాంతం ఉంది….మనం హైదరాబాద్ ను పోగొట్టుకుంటే తెలంగాణ ప్రజలు కోస్తా ప్రాంతాన్ని కోల్పోయారు
తెలంగాణకు హైదరాబాద్ ఉంటే మనకు చంద్రబాబు నాయుడు ఉన్నారు
యువత ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేయడమే గాక ఇరుగుపొరుగు, రాష్ట్రం, దేశం భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి
పార్లమెంటులో యువత ప్రాతినిధ్యం వహించే పరిస్థితి రావాలి
1991లో దూబగుంట రోశమ్మ నాయకత్వాన సారా వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు
మహిళలు చేపట్టిన ఆ ఉద్యమానికి అప్పట్లో సీపీఎం, సీపీఐ తదితర పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది
అంగ, అర్థబలాలు కలిగిన సారా కాంట్రాక్టర్లను అడ్డుకుని దుకాణాల వేలం పాటలు జరగకుండా అడ్డుకున్నాం
అప్పట్లో మా పెద్దాయన ఎన్టీఆర్ ను నెల్లూరుకు తీసుకొచ్చి వీఆర్సీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించాం
సారా నిషేధమే లక్ష్యంగా ఎన్టీఆర్ ను ఆ సభకు ఆహ్వానిస్తే ఆయన ఏకంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలులోకి తెస్తామని ప్రకటించారు
ఎన్టీఆర్ దెబ్బకు అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి దిగివచ్చి సారా నిషేధం విధించారు
ఒక నిరుపేద మహిళ రోశమ్మ చేపట్టిన సారా వ్యతిరేక ఉద్యమం అప్పట్లో రాష్ట్రమంతా సంపూర్ణ మద్యపాన నిషేధానికి దారితీసింది
నేను ఎన్నికల్లో నాలుగు సార్లు ఓడిపోయాను..కానీ ఏనాడు ప్రజా ఉద్యమాల విషయంలో వెనకడుగు వేయలేదు
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంగా ఉన్నా పోరాటాలే ఊపిరిగా ముందుకు సాగాను
రాజకీయ నాయకులు ఓట్ల కోసమే కాదు…ప్రజలు, సమాజం కోసం పనిచేయాలి
యువత రొటీన్ లైఫ్ తో సరిపెట్టుకోకుండా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను
*కార్యక్రమంలో పాల్గొన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ సునీత, వీ.ఎస్.యూ కళాశాల ప్రిన్సిపల్ విజయ, కోట సునీల్ కుమార్, అల్లం ఉదయ శంకర్, అల్లం ఉదయకుమార్ తదితరులు*