*” దేశానికి నిజమైన చదువుల తల్లి సావిత్రి భాయి ఫూలే”* *: జనతా వాకర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్*
జనతా వాకర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నగరంలోని మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ
భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతి కొరకు విశేష కృషి చేసినారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి ఆ తల్లి,ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని అన్నారు.
జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాయల మధు మాట్లాడుతూ పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని ఈ దేశంలోని అణగారిన వర్గాలు కుల వివక్షకు గురైన వర్గాలకు సావిత్రిబాయి పూలే చదువు చెప్పకపోతే ఇప్పటికీ కూడా ఈ సమాజంలో ఆ వర్గాల వారు వెనుకబడి ఉండేవారని అటువంటి మహనీయురాలి గురించి నేటి తరం వారు తెలుసుకొని వారిని స్మరించుకోవాలని తెలిపారు. ఇప్పటికీ కూడా సమాజంలో అక్కడక్కడ మహిళల పైన బాలికల పైన వివక్ష కొనసాగుతూ ఉందని దీనిని ఎదిరించటానికి సావిత్రిబాయి పూలే చూపిన మార్గమే శరణ్యమని ఇంకో మార్గం లేదని తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మార్గంలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా పండించారని బడుగు బలహీనవర్గాల ప్రజలు ఇప్పటికైనా వీరి యొక్క మార్గాన్ని అనుసరించి తీరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిచెర్ల ఉదయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు తిరకాల శివా గౌడ్, తణుకు ముని బాబు జిల్లా కార్యదర్శి తులసి, పైడి చరణ్ తేజ, దోర్నాధుల పవన్ గౌడ్ జిల్లా న్యాయ సలహా కార్యదర్శి నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.