*దేశం గర్వించదగ్గ గొప్ప ప్రజా నాయకుడు సీతారాం ఏచూరి, ఆయన మరణంతో ప్రశ్నించే గొంతుక ను కోల్పోయాం.*
*- బీద.రవిచంద్ర, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*
జె ఎన్ యు లో విద్యార్ధి నాయకుడిగా మొదలై అంచలంచెలుగా అనేక పదవులను అలంకరించి కమ్యునిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికే వన్నె తెచ్చిన నాయకుడు సీతారాం.ఏచూరి.
దేశానికి నష్టం కలిగించే ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవడం తో పాటు వాటి పట్ల ప్రజలను చైతన్య పరచడం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప కమ్యూనిస్ట్ సీతారాం ఏచూరి.
కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉద్యమ బలోపేతానికి సీతారాం ఏచూరి ఎంతో శ్రమించారు. మరెందరికో స్ఫూర్తి గా నిలిచారు.
రాజ్యాంగ హక్కుల సాధనకై , అణగారిన వర్గాల గొంతుకై నిలిచిన సీతారాం ఏచూరి తెలుగువాడు కావడం మనకెంతో గర్వకారణం.
సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు, పేద, బడుగు బలహీన వర్గాలకు, దళిత వర్గాలకు సైతం తీరని లోటు.
సీతారాం.ఏచూరి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.