*దేశంలో సంక్షేమ పథకాలను నాంది పలికిన నాయకులు నందమూరి తారక రామారావు : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా మనుబోలులో ఆయన విగ్రహానికి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
దేశంలో సంక్షేమ పథకాలను నాంది పలికిన నాయకులు నందమూరి తారక రామారావు
రేషన్ కార్డు, పింఛన్, పక్కా ఇల్లు లాంటి ఎన్నో పథకాలకు ఎన్టీఆర్ బ్రాండ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకు లేని విధంగా నెల్లూరుకు 146 టీఎంసీల సామర్ధ్యం కలిగిన సోమశిల, కండలేరు జలాశయాలు ఉండటం ఎన్టీఆర్ పుణ్యమే
ఈ జలాశయాల విషయంలో అప్పటి ఇరిగేషన్ మంత్రిగా ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులైన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా కీలకపాత్ర పోషించారు.
భవిష్యత్ తరాలు కూడా ఎన్టీఆర్ కు రుణపడి ఉంటాయి