*దివ్యాంగులను ఆదుకుంటాం : కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు.*
ఎంతో ఉన్నత ఆశయంతో జిల్లాలోని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు.
గురువారం విపిఆర్ నివాసంలో విడవలూరు మండలం ముదివర్తికి చెందిన ప్రత్తిపాటి గోపి, ఇందుకూరుపేట మండలం పోతురాజు దిబ్బకు చెందిన ఓరుసు సాంబయ్యకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారు ట్రై సైకిళ్లు అందజేశారు.
నడవలేక అవస్థలు పడే ఏ ఒక్క దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందకుండా ఉండకూడదన్నది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లక్ష్యమన్నారు.
ఇప్పటికే జిల్లావ్యాప్తంగా కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల వ్యాప్తంగా ట్రై సైకిళ్లు అందించామన్నారు. ట్రై సైకిళ్ళు అందుకున్న దివ్యాంగులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.