*దివ్యాంగులకు అండగా విపిఆర్ ఫౌండేషన్*
*మానవ సేవే మాధవ అన్నది వారి నైజం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వారి స్వభావం.*
మొన్నకు మొన్న ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో 150 మంది దివ్యాంగులకు తమ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ఉచితంగా అందచేసి తమ గొప్ప మనసును చాటుకున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు, తనయులు అర్జున్ రెడ్డి శనివారం ఇందుకూరుపేట, విడవలూరు మండలాలకు చెందిన 7 గురు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లోని వేమిరెడ్డి నివాసంలో జరిగిన ట్రై సైకిల్స్ పంపిణి కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు