*దివ్యాంగులకు అండగా.. మదినిండా పండుగ*
– రేపే రూరల్ నియోజకవర్గ ఎలక్ట్రిల్ ట్రై సైకిళ్ల పంపిణీ, కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం
– విపిఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాట్లు పూర్తి
– విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు 850 ట్రై సైకిళ్ల అందజేత
– హాజరు కానున్న ఎంపీ వేమిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
దివ్యాంగులకు అండగా నిలుస్తూ.. వారి మదిలో సంతోషం నింపుతూ ఒక ఉన్నతాశయంతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ నెల 4న బుధవారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా.. విపిఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే సభా ప్రాంగణానికి ట్రై సైకిళ్లు చేరుకున్నాయి. ట్రై సైకిళ్ల పంపిణీ అనంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గస్థాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరగనుంది.
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు.. రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ.. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేల సహకారంతో ఇప్పటికే కోవూరు, ఉదయగిరి, కందుకూరు, కావలి నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు, దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్ల పంపిణీ పూర్తి చేయగా.. ఆత్మకూరులో మంత్రి ఆనంతో ఆత్మీయ సమావేశం, ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు.
విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్ల పంపిణీ చేపట్టగా.. ఇప్పటికే ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, కందుకూరు, కావలి నియోజకవర్గాల్లో ఎంపీ వేమిరెడ్డి ట్రై సైకిళ్లు అందించారు. ఒక్కో ట్రై సైకిల్ విలువ రూ.45 వేలకు పైనే ఉండగా.. ట్రై సైకిళ్లు అందించడంతో పాటు వాటి నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 100 మంది దివ్యాంగులను గుర్తించి వారికి ట్రై సైకిళ్లు అందించనున్నారు. ఇప్పటివరకు పూర్తయిన నియోజకవర్గాల్లో దాదాపు 800 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ట్రై సైకిళ్ల పంపిణీ, ఆత్మీయ సమావేశం ఈ నెల 4న బుధవారం ఉదయం 10:00 గంటలకు నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడులో ఉన్న విపిఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.