*దివ్యాంగులకు అండగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*
– నలుగురికి ట్రై సైకిళ్ల అందజేత
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వందలాదిమంది దివ్యాంగులను ఆదుకుంటున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు శుక్రవారం నెల్లూరులోని ఆయన నివాసంలో నలుగురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందచేశారు.
నడవలేక అవస్థలు పడే ప్రతి ఒక్క దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందచేయడం విపిఆర్ ఫౌండేషన్ లక్ష్యమన్నారు. కొడవలూరు మండలం చెందిన చెంచయ్య, చెందిన కోటయ్య, ఇందుకూరుపేట మండలం డేవిస్పేట కు చెందిన మనోహర్, అనుమసముద్రం మండలం సోమశిలకు చెందిన కామేశ్వరి నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని విపిఆర్ నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్ళు అందుకున్నారు.
ట్రై సైకిళ్ళు అందుకున్న దివ్యాంగులు ఎంపి వేమిరెడ్డి గారి దాతృత్వం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఏపీ ఆగ్రో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.