*దాన కర్ణుడు ఎంపీ విపిఆర్*
– కొండాపురం మండలం భీమవరప్పాడు లో వి పి ఆర్ అమృత ధార ను ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల
– దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందించడం ఆనందాన్నిచ్చింది
– నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యు
దాన కర్ణుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కొనియాడారు. మంగళవారం కొండాపురం మండలం భీమవరప్పాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్ ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. రిబ్బన్ కటింగ్ చేసి ప్లాంట్ ను ప్రారంభించారు. మహిళలకు బిందెలతో అమృత ధార వాటర్ ను అందజేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సులభమని, వాటి మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టమన్నారు. దానికోసం ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వికలాంగులకు నియోజకవర్గంలో 150 ట్రైసైకిళ్లు అందజేశానని, ట్రై సైకిళ్లు అందజేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇంటికే పరిమితమైన దివ్యాంగులు జనజీవనంలో తిరుగుతున్నారన్నారు. పేదలను ఆదుకునేందుకు నేనెప్పుడూ ముందుంటానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు వి పి ఆర్ అమృత దార వాటర్ ప్లాంట్ ఒక ఆయుధం అన్నారు. అడగంగానే అన్ని ఇస్తున్న శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా గ్రామస్తులు ఎంపీ వేమిరెడ్డికి, ఎమ్మెల్యే కాకర్ల గారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్ను బోయిన చంచల బాబు యాదవ్, మండల కన్వీనర్ మావిళ్ళ ఓంకారం, బోట్ల గుంట హరిబాబు, మాజీ జెడ్పిటిసి సభ్యులు దామ మహేశ్వరరావు, జనసేన కోఆర్డినేటర్ కొట్టే వెంకటేశ్వర్లు, యారవ కృష్ణయ్య నాయుడు, చాగంటి కృష్ణ, జూపల్లి రాజారావు, పోలినేని చంద్రబాబు, టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు తాటికొండ అనూష, పూసల వెంగప నాయుడు, కొండలరావు అల్లిక మధు బిజెపి మండల అధ్యక్షులు మల్లికార్జున టిడిపి మండల కన్వీనర్ నారాయణ, గంట నరసింహులు జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ మాజీ ఎంపీపీ పోలినేని చంద్ర, చెంచు నాయుడు తదితరులు ఉన్నారు.