*దళితుల ఆర్థిక అభివృద్ధిని అడ్డుకోవడం దారుణం : ఆర్ పి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్కే. మాబు*

దళితుల ఆర్థిక అభివృద్ధిని అడ్డుకొని 9 కోట్ల 50 లక్షల ప్రభుత్వ ధనాన్ని నాశనం చేశారని బుజబుజ నెల్లూరు దగ్గర తుప్పు పట్టిన పాడైన వాహనాల దగ్గర ఆర్ పి ఐ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్కే మాబు మాట్లాడుతూ 2018 సంవత్సరం ఆఖరి నెలలో ఎన్ఎస్ఎఫ్డిసి కేంద్ర ప్రభుత్వం సమస్త వాళ్లు నిరుపేద దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాతారనే ఉద్దేశంతో సబ్సిడీ లోన్లు కింద వాహనాలు కేటాయించి లబ్ధిదారులకు పంపిణీ చేయమంటే ఎన్నికల కోడ్ వచ్చినందున నిలిపివేశారు.

ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ఆ వాహనాలు దేనికి పనికి రాకుండా చేసి దళితుల ఆర్థిక అభివృద్ధి అడ్డుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు 9 కోట్ల 50 లక్షల వాహనాలు అలా దేనికి పనికి రాకుండా చేసిన సంబంధిత అధికారులను ప్రజాప్రతితులను కఠినంగా శిక్షించాలని ఆర్ పి ఐ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు

ఎక్కడ చూసినా దళితులు ముస్లింలు బహుజనలు ఆర్థిక అభివృద్ధిని అడ్డుకోవడమే ఆనవాయితీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ లోన్లు ఇస్తుంటే అధికారులకు ప్రజాప్రతినిధులు వాళ్ళ ఆస్తుల్లో ఏదో ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారని మండిపడ్డారు

ఈ తుప్పు పట్టిన పోక్ లేన్లు ట్రాక్టర్లు ఆటోలను వాహనాలు ఏదో విధంగా రీ మోడలింగ్ చేయించి 2018. 19 సంవత్సరంలో ఎంపిక చేసిన లబ్ధిదారులైన నిరుపేదలైనటువంటి దళితులకు కేతయించాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తల మధుసూదన్.దుంపల సుబ్బారావు.ఆరికొండ సురేష్.ముసలి జయరాజ్ తూపిలి వంశీకృష్ణ.వల్లపు ధనుంజయ.వజ సుధాకర్.కంచి అశోక్.ప్రశాంత్.కల్లు అనిల్. శ్రీధర్.ఎస్.కె బాబు. అర్షద్. నంబూరు గణేష్. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed