
*దళితులు ముస్లింల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఆర్ పి ఐ.పార్టీ ఇఫ్తార్ విందు*
ఆర్ పి ఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం నందు జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాపు రంగరావు బత్తల మధు దుంపల సుబ్బారావు చిట్టేటి శ్రీనివాసులు వాటంబేడి నాగేంద్ర ముసలి జయరాజ్ పార్టీ నాయకులు అందరూ ఇఫ్తార్ విందు నిర్వహించారు.
ఆ విందులో ముఖ్య అతిథిగా ఆర్ పి ఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ కె మాబు గారిని ఆహ్వానించారు ఇఫ్తార్ విందులో పాల్గొన్న అనంతరం జిల్లా అధ్యక్షులు మాబు మాట్లాడుతూ
మనం సాధారణంగా ఎన్నో ఇఫ్తార్ విందులు చూసి ఉంటాం. ముస్లిం మైనార్టీలు ఇఫ్తార్ విందు నిర్వహించి ఇతర రాజకీయ పార్టీ వారిని ఎంపీ నో ఎమ్మెల్యే నో మినిస్టర్ ఒక సెలబ్రిటీనో విందుకు పిలుచుకుంటా రన్నారు.
కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన ఆర్ పి ఐ పార్టీలో నాయకులు నా దళిత సోదరులు ఇఫ్తార్ విందు నిర్వహించి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఎంతో సంతోషం ఉందని నేను ఏదో సాధించేసాను అని గర్భంగా ఉందన్నారు. మనమందరం ఇలానే కలిసి మెలిసి ఉంటే ఏమైనా సాధించ వచ్చున్నారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు కొప్పోలు ప్రమీల హార్దిక బేగం స్వప్న ప్రశాంత్ గౌడ్ వెంకటేష బాబురావు పి ప్రకాష్ యాదవ్ వల్లం నాగ సందీప్ అశోక్ సుజిత్ రమేష్ మీర్జా ఆలీ బెల్లంకొండ ధనుంజయ తూపిలి వంశీకృష్ణ ఉప్పల మాలకొండయ్య డక్కా చిరంజీవి ముస్లిం మత గురువు ఇలియాస్ మౌలానా తదితరులు పాల్గొన్నారు