*దీన దయాళ్ అంత్యోదయ యోజన కింద ఆంధ్రప్రదేశ్‌కు ఎంత కేటాయించారు? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వేమిరెడ్డి*
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకందీన్గా చేపట్టిన దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు లోక్‌సభలో ప్రశ్నించారు. మంగళవారం ఈ మేరకు పలు అంశాలపై ఆయన లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ మిషన్ 2023-24 నాటికి పది కోట్ల మంది మహిళలకు చేరువ కావాలని ప్రభుత్వం నిర్ణయించింది వాస్తవమా అని ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో మిషన్ అమలు చేయబడిన బ్లాకుల వివరాలు, ఆంధ్రప్రదేశ్ కు DAY-NRLM కింద కేంద్ర కేటాయింపులు ఎన్నని కోరారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 2023-24 నాటికి దీనదయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (DAY – NRLM) కింద 10 కోట్ల గ్రామీణ కుటుంబాలను SHGలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మార్చి 2024లోనే ఈ లక్ష్యాన్ని సాధించామన్నారు.
నెల్లూరు జిల్లాలో 37 రూరల్ బ్లాక్‌లు ఉన్నాయని, ఈ అన్ని బ్లాకుల్లో DAY-NRLM మిషన్ అమలవుతోందన్నారు. ఈ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ కు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.756 కోట్లు కేంద్ర కేటాయించిందని, అయితే ట్రెజరీ నుండి నిధులు రావడంలో జాప్యం, రాష్ట్రం ప్రతిపాదనలు సమర్పించకపోవడంలో ఆలస్యం వల్ల ఇప్పటివరకు కేవలం రూ. 377 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి DAY-NRLM కింద కేంద్ర వాటా రూ.307.69 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.76.92 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు.
మహిళాకిస్తాన్ సశక్తికరణ్ పరియోజన (MKSP) కింద ఆంధ్రప్రదేశ్‌లో 13 ప్రాజెక్టులకు మంత్రిత్వ శాఖ 2011లో ఆమోదం తెలిపిందని, ఈ ప్రాజెక్టులు 2019 ఆర్థిక సంవత్సరంలో మూసివేయబడ్డాయన్నారు. MKSP పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 64 కోట్లు కేటాయించగా.. కేంద్ర వాటాగా రూ. 38.40 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ. 25.60 కోట్లన్నారు. అంతేకాకుండా, వ్యయ శాఖ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధుల విడుదలకు తప్పనిసరి అయిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (PFMS) TRSY-07 నివేదికలో MKSP బడ్జెట్ కేటాయింపు చేయలేదన్నారు. దీని కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో MKSP కోసం ఆంధ్రప్రదేశ్ SRLMకి మంత్రిత్వ శాఖ ఎటువంటి నిధులను విడుదల చేయలేదని వివరించారు.
ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం కేటాయింపులు 15 కోట్లు కాగా కేంద్రం రూ. 9 కోట్లు, రాష్ట్రం రూ.6 కోట్ల వాటాఅని, కేంద్ర వాటాలో భాగంగా రూ.2.25 కోట్లు విడుదల చేశామన్నారు. స్టార్ట్-అప్ విలేజ్ ఎంటర్ప్రైన్యూర్షిప్ ప్రోగ్రామ్ (SVEP)కి సంబంధించి, రాష్ట్రం నుంచి DPRల సమర్పణ ఆధారంగా నిధులు విడుదల చేయబడతాయని, అయితే ఆంధ్రప్రదేశ్ SRLM SVEP కాంపోనెంట్లకు అవసరమైన DPRలు సమర్పించడంలో జాప్యం చేయడం వల్ల నిధుల విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 13.33 కోట్లు కాగా.. రూ. కేంద్ర వాటాగా 8 కోట్లలో రూ. 2 కోట్లు విడుదల చేశామన్నారు.